Home  »  TV News  »  బిగ్ బాస్ హౌజ్ లో శివాజీ ఆధిపత్యం.. అడుగున పడిపోయిన సీరియల్ బ్యాచ్!

Updated : Sep 23, 2023

బిగ్ బాస్ ఈ సారి ఉల్టా పల్టా అంటూ ఇప్పటివరకు లేని విధంగా టాస్క్ లతో కంటెస్టెంట్స్ కి మతిపోగొడుతున్నాడు బిగ్ బాస్. మొదటి హౌజ్ మేట్ గా ఆట సందీప్ ఎన్నికయ్యాడు. రెండవ హౌజ్ మేట్ గా టాస్క్ గెలిచి శివాజీ  VIP రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌజ్ లో మొత్తం పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఇద్దరు  మాత్రమే హౌజ్ మేట్స్ అయ్యారు. ప్రతి టాస్క్ లోను ఇప్పటివరకు ఆట సందీప్ సంచలకుడిగా ఉంటూ వస్తున్నాడు. కానీ ఆట సందీప్ సంచాలకుడిగా మొదటి వారం మాత్రమే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ప్రతి టాస్క్ లోను భేదాభిప్రాయాలు చూపించకుండా సమన్యాయం పాటిస్తూ వస్తున్న శివాజీనే సంచాలకుడిగా వ్యవహరించి ఉంటే బాగుండేదంటు ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

శివాజీ  పవరస్త్రని అమర్ దీప్ దొంగిలించిన విషయం తెలిసిందే. దొంగిలించినప్పటి నుండి శివాజీ ఇండైరెక్ట్ గా  దొంగిలించిన వాళ్ళకి కౌంటర్ ఇస్తూనే వచ్చాడు. కానీ కళ్ళతో చూడకుండా మనం డైరక్ట్ గా ఒకరిపై అలిగేషన్ వెయ్యడం కరెక్ట్ కాదని భావించిన శివాజీ.. నా పవరస్త్రని ఎవరు తీసుకున్నారో చెప్పండంటు అడిగాడు. అలా ఇండైరెక్ట్ గా కౌంటర్ వేస్తునే తీసుకున్న వారికి భయం పుట్టేలా చేసిన శివాజీ..‌ తన మాస్ వార్నింగ్ తో కంటెస్టెంట్స్ లో భయం పుట్టించాడు. అయితే పవరస్త్రని తీసిన అమర్ దీప్ అదంతా విని భయపడ్డట్టుగా తెలుస్తుంది. కొంత సమయానికి ఆ టెన్షన్ భరించలేని అమర్ దీప్.. కష్టపడి సంపాదించుకున్న పవరస్త్రని దొంగతనం చెయ్యడం తప్పని భావించాడు.  శివాజీ ఒంటరిగా రూమ్ లో ఉన్నప్పుడు సారీ చెప్పి తన పవరస్త్రని తనకి ఇచ్చేసాడు అమర్ దీప్. అమర్ దీపే పవరస్త్రని దొంగిలించాడని శివాజీకి తెలిసిన ఏం అనకుండా.. మీరు చిన్నపిల్లలు రా పర్వాలేదని, ఇవన్నీ నేను ఎప్పుడో చేశానని ఒక్క మాట కూడా అనలేదు. 

బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ కి శివాజీ పెద్ద రాయుడు అనే చెప్పాలి. ఎవరైనా తప్పు చేసిన సరిదిద్దేతత్వం ఉంది. బేధాలు చూపెట్టకుండా అందరికి సమన్యాయం చేస్తూ వస్తున్నాడు శివాజీ. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్ పోటీ నుండి తప్పుకున్నాక శివాజీ దగ్గరికి వచ్చి తన భాధని చెప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో శివాజీ ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాప్-5 లో ఉన్నాడు.  ఇక నామినేషన్లో ఉన్న సీరియల్ బ్యాచ్ అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి చివరి స్థానాలలో కొనసాగుతున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.